బొగ్గు బ్లాక్ ల వేలంలో పాల్గొనేందుకు సంస్థ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి.
దశల వారీగా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
గోదావరిఖని మార్చి-11// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సి అండ్ ఎండి స్థాయి సమావేశంలో ముఖ్య మైన కార్మికుల సమస్యల్ని పరిష్కరించడం జరిగింది సింగరేణి కి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ 33 వేల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలి సింగరేణి లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం మితి మీరిన రాజకీయ జోక్యం వల్లనే కార్మికుల్లో వ్యతిరేకత వచ్చి కోల్ బెల్ట్ ప్రాంతంలో బిఆర్ఎస్ కు ఒక్క ఎమ్మెల్యే గెలవలెదు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బిఆర్ఎస్ కన్నా విపరీతంగా రాజకీయ జోక్యం చేస్తూ సంస్థ దివాలా తీసే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ జోక్యం విడనాడి పరిశ్రమ ను, గుర్తింపు సంఘం యొక్క స్వయం ప్రతిపత్తి ని కాపాడాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


