Nerella Sharada as Telangana Women Commission Chairman
Trinethram News : Telangana
తెలంగాణ మహిళా కమిష న్ చైర్మన్‌గా నేరెళ్ల శారద ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ బుద్ధ భవన్ లోని కమిషన్ కార్యాల యంలో బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీటిపారుదల, పౌర సరఫ రాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పద్మావతి రెడ్డి, వినోద్.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నేరెళ్ల శారద మాట్లాడుతూ.. తనపైన నమ్మకం ఉంచి మహిళా కమిషన్ చైర్మన్‌గా నియ మించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.
మహిళలపైన జరుగుతున్న అకృత్యాలను నివారించేం దుకు చర్యలు చేపడతా మని చెప్పారు. మహిళల సంరక్షణతో పాటు పురు షులు స్త్రీలను గౌరవించే విధంగా పని చేస్తానని అన్నారు.
మహిళా కమిషన్ సమీక్ష సమావేశం తరువాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App