WhatsApp Image 2024 07 13 at 17.19.04
Natu Sara sales in the district The jungle Srirampur village is the top spot
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ముత్తారం మంథని మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో విచ్చల విడిగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయి, కల్తీ నాటు సారా తాగి గ్రామ ప్రజలు, యువకులు శ్వాస కోశ సంబంధిత మరియు ఊపిరి తిత్తుల వ్యాధితో మంచాన పడుతున్నారు గుడుంబా అక్రమ అమ్మకాలపై ప్రశ్నిస్తే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న విక్రయదారులు అధికారుల పర్యవేక్షణ గ్రామంలో కరువయ్యింది ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో బానిసల సంఖ్య పెరిగి గ్రామంలో ఏలాంటి పరిస్థితులు చూడవలసి వస్తుందో ఆని గ్రామస్తులు ఆందోళనకు గురి అవుతున్నారు, గుడుంబా మత్తులో ఊరిలో తిరుగుతూ మహిళల పట్ల వెక్కిలి చేష్టలకు పాల్పడుతున్నారని, తగు విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
