జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పారంభించిన
పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు మ్రింగించడం వలన రక్త హీనత, పోషకాహారలోపం నివారించవచ్చు.
జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచుకుని ప్రతి 6 నెలలకు ఒకసారి నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు మ్రింగించడం జరుగుతుందని కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం తాళ్లపూడి మండలం వేగేశ్వర పురం కె ఎస్ ఆర్ జిల్లాపరిషత్ హై స్కూల్ నందు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పాఠశాల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 4,30,339 పిల్లలకు లక్ష్యనికి గాను 4,07,961 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేసి 94.8% మేర లక్ష్యసాధన పూర్తి చేసామన్నారు. మిగిలిన వారికీ ఈ నెల 17 వ తేదీన మ్రింగించడం జరుగుతుందన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు మ్రింగించడం జరుగుతుందని కలెక్టర్ తెలియ జేసారు. ముఖ్యం గా పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు మ్రింగించడం వలన రక్త హీనత, పోషకాహారలోపం నివారించవచ్చునని తెలియజేసారు. అంగన్వాడి కేంద్రాలు, స్కూల్స్, కాలేజి లలో ఉన్న 1-19 సంవత్సరముల పిల్లలందరికీ మాత్రలు వేయడం జరుగుతుందని తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖా ధి కారి డా . కె . వెంకటేశ్వర రావు, కొవ్వూరు ఆర్ డి ఓ రాణి సుస్మిత, డి సి హెచ్ ఎస్ డా . పద్మశ్రీ రాణి, డిప్యూటీ డిఎంహెచ్వో ఇంచార్జ్ డా .ధర్మ రాజు గారు , ఆర్ పి ఎస్ కే ప్రోగ్రాం ఆఫీసర్ డా. హరిచంద్ర ప్రసాద్ డిస్ట్రిక్ట్ సర్వేలన్స్ ఆఫీసర్ డా . రాజీవ్, జిల్లా ఎపిడిమియాలజిస్ట్ సుదీర్ బాబు జిల్లా ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. విజయ కుమారి, జిల్లా విద్యా శాఖా ధి కారి వాసుదేవరావు, తాళ్లపూడి పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డా.హారిక గుప్తా ఎంపీడీవో రమణ, పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు బాలామణి , తాళ్ళపూడి తహశిల్దార్ ఐ /సి భారత , పంచాయతి కార్యదర్శి ,ఆరోగ్య సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


