National Dengue Day : జాతీయ డెంగ్యూ నివారణ దినం అవగాహాన ర్యాలిని ప్రారంబించిన

TRINETHRAM NEWS

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి
పెద్దపల్లి జిల్లా మే-16//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : పెద్దపల్లి జిల్లా యందు జాతీయ డెంగ్యూ నివారణ దినం ను పురస్కరించు కొని అవగాహాన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ జి. అన్నా ప్రసన్న కుమారి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, పెద్దపల్లి గారు జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా ఆసుపత్రి నుండి అయ్యప్ప టెంపుల్ కూడలిలో మానవహారం నిర్వహించి డెంగ్యూ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నినాదాలు చేయడం జరిగినది
ఈ సంధర్బంగా డాక్టర్ జి. అన్నా ప్రసన్న కుమారి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ ఇంకో 15 రోజులలో వర్షా కాలం ప్రారంభం కానుంది అని దోమలు పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు. దోమల ద్వారా డెంగ్యూ మరియు ఇతర కీటక జనిత వ్యాధులు రాకుండా దోమల వృద్ధిని హరికట్టుటకు వివిధ ప్రభుత్వ శాఖలను ముఖ్యంగా మున్సిపాలిటీ , గ్రామ పంచాయితీ సిబ్బంది ని మరియు ప్రజలను భాగసౌమ్యం చేస్తూ వివిధ కార్యాక్రమముల ద్వారా డెంగ్యూ వ్యాధిని ఆరికట్టుటకు, దోమల నిర్మూలనకు అవగాహాన కల్పిస్తూ ఈ కార్యక్రమమును ముందుకు తీసుకేళ్తున్నామని అన్నారు. ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయితి సిబ్బంది సమిష్టిగా ప్రజలు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో డ్రైడే పాటించునట్లు చేయాలి అని అన్నారు. దోమలు గుడ్లు పెట్టకుండ ఇంటి పరిసరాలలో నీరు నిల్వకుండా చూడాలని, నీటి పాత్రలు, ట్యాంక్ లను మూసి వుంచాలి అని అన్నారు. వ్యక్తిగతంగా కూడా దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పగిలిన డ్రమ్ములు, కొబ్బరి చిప్పలు, సీసాలు, కూలర్లలలో నీరు నిల్వ వున్న దోమలు గ్రుడ్లు పెట్టును.

కావున వాటిని తోలగించాలని అన్నారు. జ్వరము వచ్చిన యెడల దగ్గరలోనున్న ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్ లలో రక్త పరీక్ష చేయించుకోవాలని ప్రజలను కోరారు. డెంగ్యూ జ్వరం వచ్చిన వ్యక్తిని కుట్టిన దోమ ఆరోగ్య వంతమైన వ్యక్తిని కుట్టినచో ఈ వ్యాధి సోకుతుంది. కావున జ్వరం వచ్చిన వ్యక్తిని దోమలు కుట్ట కుండా జాగ్రత్త పడాలి, అందుకు దోమ తెరలు కట్టిన మంచం లో పడుకోవాలి అని ఇది డెంగ్యూ వ్యాప్తిని అరికట్టడానికి చాలా ముఖ్యం అని అన్నారు. డెంగ్యూ జ్వరం వచ్చినాక ఆసుపత్రులకు ఖర్చు పెట్టడం, వ్యాధి తగ్గుతోందా లేదా అనే వత్తిడికి గురి కావడం, కుటుంబం పై ఆర్థిక భారంకు గురికి అయ్యే బదులు కిటికీలకు దోమ తెరలు (మెష్)లను బిగించు కోవాలి అని అన్నారు. అలా దోమ కాటు నుండి రక్షణ పొందాలి, తద్వారా వచ్చే వ్యాధుల బారిన పడకుండా చూసు కోవాలి అని ప్రజలను కోరినారు
ఈ కార్యక్రమములో డాక్టర్ బి. శ్రీరాములు, ప్రోగ్రాం అధికారి, డాక్టర్ ఆర్ .రాజమౌళి ప్రోగ్రాం అధికారి, డాక్టర్ కె.వి. సుధాకర్ రెడ్డి, ప్రోగ్రాం అధికారి, ఎస్.వేంకటేశ్వర్లు, డిప్యూటీ డెమో, కె. రమేష్, డి.పి.ఎమ్.ఒ., టి. రాజేశం, యం.పి.హెచ్.ఇ.ఒ., పి. రవీందర్, బి. అంజయ్య, సబ్ యూనిట్ అధికారులు, సి.హెచ్. శ్రీనివాస్, ఆరోగ్య పర్యవేక్షకులు, రాఘవాపూర్ మరియు రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆరోగ్య పర్యవేక్షకులు, యం.పి.హెచ్.ఎ (ఫిమేల్), (మేల్), ఆశ కార్యకర్తలు పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

National Dengue Prevention Day

You cannot copy content of this page

Scroll to Top