భారతదేశానికి సరైన నాయకుడు నరేంద్ర మోడీ – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఈ రోజు ఢిల్లీలో ఎన్డీఏ గెలుపు, కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదు. ఇది దేశ ప్రజల గెలుపు కూడా. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పని చేస్తుందని ఈ ఎన్నికే మరోసారి నిరూపించింది.
సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది.. మౌలికవసతులు వస్తాయి.సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్లే. 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలను తెలుగుబిడ్డ పీవీ తీసుకువచ్చారు. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం స్కాంతో పోల్చుకుంటే, ఢిల్లీలో జరిగిన స్కాం చాలా చిన్నది. మద్యం కుంభకోణంలో వచ్చే డబ్బు, పాపిష్టి డబ్బు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి, వేల కోట్లు దోచుకున్నారు.
ఢిల్లీలో షీష్ మహల్, మనకి ఇక్కడ రుషికొండ ప్యాలెస్.. ఇలాంటి విచ్చలవిడితనాన్ని ప్రజలు ఆమోదించరు అని చెప్పటానికి, మొన్న ఆంధ్రప్రదేశ్, ఈ రోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణ. రెండు చోట్లా వాళ్ళు కట్టుకున్న ప్యాలెస్ లోకి ప్రజలు వెళ్ళనివ్వకుండా తీర్పు ఇచ్చారు.
గత 30 ఏళ్ళుగా తెచ్చిన పాలసీలు, ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించాయో చర్చించాలి. ఏ నాయకుడి వల్ల ప్రజలకు, రాష్ట్రానికి న్యాయం జరిగిందో చర్చ జరగాలి. పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.
2047 నాటికి రాష్ట్రంలో 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉండాలని ఒక విజన్ పెట్టుకున్నాం. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42,000 డాలర్లు ఉండే దిశగా పాలసీలు రూపొందిస్తున్నాం.
మన రాష్ట్ర రైతులు చాలా తెలివైనవాళ్లు.. చెబితే చాలు అల్లుకుపోతారు. సాగునీరు పుష్కలంగా ఉన్న అనేకచోట్లకు మన రైతులు వెళ్లారు. ప్రకృతి సాగు ఉత్పత్తులకు మంచి ధర వస్తోంది. ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్‌గా మారే శక్తి ఏపీకి ఉంది.
నేను ఎప్పుడూ సిద్ధాంతాల ఆధారంగానే రాజకీయాలు చేశా కానీ, వ్యక్తిగతంగా ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. ఈ రోజు మన రాష్ట్రంలో ఇలాంటి అహంకారులతో రాజకీయాలు చేయాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App