అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Nandi Awards

Nandi Awards : తూర్పుగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 18 ; నిడదవోలు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు , రాష్ట్ర సాంస్కృతిక యువజన క్రీడామంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నంది నాటకోత్సవాలకు సంబంధించి రెండు రోజులలో నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది 2027 లో నంది అవార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సూచించారు.

ఆ ఉత్సవాలు జరిగే సమయంలోనే సంబంధిత అవార్డుల ప్రధానం కూడా ఉంటుందని వెల్లడించారు. తెలంగాణతో కలిసి ఆ అవార్డుల ఇవ్వడం కుదరదని ఆయన గుర్తు చేశారు. అవార్డుల కమిటీని త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page