జూన్ 26, 2026
TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 28 : ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా టిడిపి నాయకులు అట్లూరి దీపక్ చౌదరి , కొల్లూరి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు కెపిహెచ్బి కాలనీ జేఎన్టీయూ దగ్గర గల నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ తారక రామారావు కళారంగాలకు బడుగు, బలహీన వర్గాలకు జీవితాంతం సేవ చేశారని , తెలుగు జాతిని తెలుగువారి గుర్తింపుని ప్రపంచానికి చాటి చూపించి తెలుగువారి గౌరవాన్ని కాపాడారని ఇటువంటి పేదల పెన్నిధి మళ్లీ మనలో పుట్టాలని కోరుకుంటూ రామారావు ఆదర్శాలను ప్రతి ఒక్కరు పాటించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ పులగం సుబ్బు ,బలిజేపల్లి శంకర్రావు, టిడిపి నాయకులు అయినంపూడి శివన్నారాయణ, ప్రవీణ్, రవి, కిషోర్ బాబు మరియు టిడిపి నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nandamuri Taraka Rama Rao

You cannot copy content of this page