Municipal Sanitation Workers : మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలి

TRINETHRAM NEWS

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఇల్లు, ఇళ్ల స్థలాల కాలనీలు ఏర్పాటు చేయాలి

త్రినేత్రం న్యూస్, కాకినాడ, అక్టోబర్,15: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ, బంధ సంఘం కాకినాడ, కమిటీ సమావేశం బుధవారం ఉదయం కాకినాడలో, స్థానిక బాల భవన్ వద్ద యూనియన్, అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్, అధ్యక్షతన నవంబర్ 3న జరిగే సమ్మెకు సన్నాహ, సమావేశం జరిగింది. ఈ సమావేశానికి, ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు నవంబర్ 3వ తేదీ లోపు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా దఫ దఫల ఆందోళనకు పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగానే ఈనెల 13వ తేదీన అడిషనల్ కమిషనర్ కి సమ్మె నోటీస్ అందించామని, రేపు ఉదయం గాంధీ విగ్రహాలకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేస్తామని, 22వ తేదీన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపడతామని, 25వ తేదీన కార్పొరేషన్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభిస్తామని, 27వ తేదీన ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని, 29, 30 తేదీలలో సీఎండీ కార్యాలయం కు తరలి వెళ్తామని ఆయన అన్నారు.

ఆప్కాస్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు అమలు చేయాలని, కాకినాడ స్పెషల్ సానిటేషన్ కార్మికులను, టాయిలెట్ కార్మికులను ఆప్కాస్ లో విలీనం చేయాలని బకాయి జీతాలు చెల్లించాలి, పర్మనెంట్ కార్మికులకు బకాయి డీఏ, సరెండర్ లీవ్ లు, ఎన్కౌస్మెంట్ బిల్లులు తక్షణమే చెల్లించాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 11 పిఆర్సి అమలు చేయాలని తదితర సాధనకు కార్మికుల సమ్మెకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు, కాలనీలు నిర్మించాలని, వారి కొరకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ సమ్మె జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, బొబ్బిలి ఈశ్వరరావు, సింగంపల్లి రమణ, బంగారు రాజేష్, నిమ్మకాయల ఈశ్వరరావు, కృష్ణ, ఎల్లారావు, దుర్గ, బండి అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Municipal sanitation workers should prepare for strike

You cannot copy content of this page

Scroll to Top