జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 19.20.35

TRINETHRAM NEWS

మున్సిపల్ కాలనీ వాంబే గృహాల సమస్యలు పరిష్కారానికి చర్యలు

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, 42వ డివిజన్లో పర్యటన

Trinethram News : రాజమహేంద్రవరం: మున్సిపల్ కాలనీలోని వాంబే గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. స్థానిక 42వ డివిజన్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, నగర పాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు మంచినీటి సౌకర్యం సక్రమంగా వచ్చేలా చూడాలని మున్సిపల్ కాలనీ వాంబే గృహాల ప్రజలు విన్నవించగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు.

మున్సిపల్ కాలనీ వాంబే గృహాల్లోని అన్ని బ్లాకుల్లోని అన్ని ఫ్లోర్లకు మంచినీటి సరఫరా అయ్యేటట్లు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి స్థానిక ప్రజలకు మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. గతంలో ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రత్నం పేటలోని ఆరు బ్లాకులకు కూడా మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. డివిజన్లో నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని శానిటేషన్ సిబ్బంది ఆదేశించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ నాయకులు మళ్ల వెంకటరాజు, కేవీ శ్రీనివాస్, ఆడారి లక్ష్మీనారాయణ, వానపల్లి శ్రీనివాస్, సావిత్రి తదితరులు వారి వెంట ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page