Mundastu Badibata : ఉత్సాహంగా ‘ముందస్తు బడిబాట’

TRINETHRAM NEWS
Enthusiastic 'Mundastu Badibata'

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి: వార్డు సభ్యురాలు ముడి కాశమ్మ, జీహెచ్‌ఎం గోప్య నాయక్.

Mundastu Badibata : డిండి(గుండ్లపల్లి ) మార్చి 31, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి(గుండ్లపల్లి )మండలం చెరుకుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ‘ముందస్తు బడిబాట‘ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించబడింది. ఒకటో వార్డు సభ్యురాలు ముడి కాశమ్మ ఆధ్వర్యంలో, స్థానిక గెజిటెడ్ హెడ్మాస్టర్ ఇస్లావత్ గోప్య నాయక్ తో కలిసి ఉపాధ్యాయ బృందం గ్రామంలోని ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు.

-ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థులకు శ్రీరామరక్ష:

ఈ సందర్భంగా వార్డు సభ్యురాలు కాశమ్మ మరియు జీహెచ్‌ఎం గోప్య నాయక్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ, బడీడు పిల్లలందరినీ విధిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని వారు పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా విద్యాబోధన చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న రుచికరమైన మధ్యాహ్న భోజన పథకం గురించి వివరించారు. చదువుకోవడానికి అనువైన వాతావరణం, క్రీడా మైదానం మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు. పుస్తకాలు, యూనిఫామ్స్ వంటి సదుపాయాల గురించి తల్లిదండ్రులకు వివరించారు.

-కదలివచ్చిన ఉపాధ్యాయ బృందం:–

ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ చెరుకుపల్లి ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల వివరాలను సేకరించి, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాల బాట పట్టించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించారు. తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top