Trinethram News : ముంబై పై ఉగ్రవాదుల దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ కు 78 ఏళ్ల జైలు శిక్ష
ముంబై పై ఉగ్రవాదుల దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ పాకిస్థాన్ లో 78 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
ఉగ్రవాదులకు ఆర్ధిక సహకారాన్ని అందిస్తున్నట్లుగా నమోదు ఐన 7 కేసుల్లో ఈ మేరకు శిక్ష పడినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.
2020 ఫిబ్రవరి 12 నుంచి హఫీజ్ సయీద్ పాకిస్థాన్ ప్రభుత్వ కస్టడీలో ఉన్నట్లు స్పష్టం చేసింది.
హఫీజ్ సయీద్ ను భారతదేశానికి అప్పగించాలని గత నెలలో పాకిస్థాన్ ను భారత్ అడిగిన విషయం అందరికీ తెలిసిందే.