జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 19 at 7.54.45 PM

TRINETHRAM NEWS

యూరోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్ డెలిగేషన్ తో సమావేశమైన శ్రీ బీద మస్తాన్ రావు

ఫిక్కి, న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో 12 మంది పార్లమెంట్ సభ్యుల యూరోపియన్ యూనియన్ బృందం భారతదేశ పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి విచ్చేశారు.

ఈరోజు 19-12-2023 వ తేదీన భారత దేశ పార్లమెంటరీ బృందం యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యుల బృందంతో సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు, లోకసభ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు మరియు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ ఆదిశేఖర రెడ్డి మొదలగు వారు భారత దేశ బృంద సభ్యులుగా సమావేశంలో పాల్గొన్నారు.

ఇరు బృందాలు పార్లమెంటు వ్యవస్థలు, పరస్పర వాణిజ్య లావాదేవీలు, ప్రభుత్వాల స్థాయిలో చేపట్టవలసిన ముఖ్యమైన పాలసీ మార్పులు మొదలగు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

బీద మస్తాన్ రావు గారి కార్యాలయము, నెల్లూరు

You cannot copy content of this page