త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లాలో 2వ సాధారణ ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. అక్టోబర్ 6న ఐ డి ఓ సి కార్యాలయంలో ఎన్నికల ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.
జిల్లాలో మొత్తం 2 రెవెన్యూ డివిజన్లు, 20 మండలాలు, 594 గ్రామ పంచాయతీలు, 5058 వార్డులు ఉన్నాయని తెలిపారు.
మొత్తం 1,289 పోలింగ్ స్టేషన్లు, 614 పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి.
జిల్లాలో 6,98,472 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో
పురుషులు – 3,43,668
మహిళలు – 3,54,788
ఇతరులు – 16 అని వివరించారు.
ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి.
మొత్తం ఎంపీటీసీల సంఖ్య – 227,
మొదటి దశలో 115, రెండవ దశలో 112 మండలాల వారీగా పోలింగ్ జరగనుంది.
దశలవారీగా మండలాల వివరాలు:
ఫేజ్-1: కోడంగల్, దౌల్తాబాద్, బోమ్రాస్పేట్, దుడ్యాల్, బంట్వారం, వికారాబాద్, ధారూర్, మార్పల్లి, మొమిన్పేట్, నవాబ్‌పేట్, కోటేపల్లి.
ఫేజ్-2: బషీరాబాద్, తాండూర్, యాలాల్, పెద్దేముల్, పూడూర్, పరిగి, డోమా, కులకచర్ల, చౌడాపూర్ మండలాలు.
ఎన్నికల నిర్వహణ కోసం
నోడల్ ఆఫీసర్లు – 12
జడ్పిటిసి ఆర్వోలు – 20
ఎంపీటీసీ ఆర్వోలు– 90
జడ్పిటిసి ఎఆర్వోలు – 90
ఎంపీటీసీ ఏఆర్వోలు– 90 నియమించబడ్డారని తెలిపారు.
మొత్తం 51 జోన్లు, 51 జోనల్ ఆఫీసర్లు, 45 ఎఫ్ ఎస్ టి టీములు ఏర్పాటు చేశామని తెలిపారు.
అదేవిధంగా 20 ఏఈవోలు 1547 పి ఓ ఎస్ ల 7145 పి ఓ ఎస్ నియమించబడ్డాయి.
పోలింగ్ సెంటర్ల భద్రతా విభజన:
హైపర్ సెన్సిటివ్ స్టేషన్లు – 358
సెన్సిటివ్ స్టేషన్లు – 289
నార్మల్ స్టేషన్లు – 618
ఇతర ఏర్పాట్లు:
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు: 04
రిసెప్షన్ సెంటర్లు: 04
స్ట్రాంగ్ రూములు: 03
కౌంటింగ్ సెంటర్లు: అనంత పద్మనాభ డిగ్రీ కాలేజ్ కాలేజ్ వికారాబాద్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిగి, సెంట్ మార్క్స్ హై స్కూల్ తాండూర్ లలో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మొత్తం 1,490 బ్యాలెట్ బాక్సులు అవసరమని, అంతే సంఖ్యలో బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ ప్రతిక్ జైన్ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


