ప్రయాణికులకు , ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న రైస్ మిల్లు యాజమాన్యం.
పలుమార్లు ఫిర్యాదు చేసినపట్టించుకోవడంలేదని ప్రజల ఆగ్రహం –ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజల వేడుకోలు.
డిండి (గుండ్లపల్లి) జనవరి 05 త్రినేత్రం న్యూస్. డిండి మండలం లోని చెరుకుపల్లి స్టేజి నుండి చెరుకుపల్లి ఊరికి వెళ్లే దారిలో శ్రీ శ్రీనివాస రైస్ మిల్ నుండి విడుదల అయ్యే వరి పొట్టు ఆ మార్గంలో వచ్చి పోయే వాహనదారులకు మరియు కాలినడకన వచ్చేటటువంటి ప్రజలకు కళ్ళలో వరిపొట్టు పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ వరి పొట్టుదుమ్ముపడివాహనదారులుప్రమాదాలకుగురవుతున్నారు మిల్లు యజమాన్యానికి పలుమార్లుఫిర్యాదుచేసినపట్టించుకోకపోవడం విడ్డూరం. ఇకనైనా అధికారులు ఈ సమస్యను గుర్తించి మిల్లు యజమాన్యానికి వరిపొట్టు బారి నుండి రోడ్డుపైన వచ్చేప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వరి పొట్టు దుమ్మును రాకుండా పెద్ద గోడ లేదా ఇంకా ఏదైనా ఏర్పాట్లు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు వాహనదారులు కోరుతున్నారు. లేనిపక్షంలో కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


