Modi inaugurates Bridge : అస్సాంలో 3030 కోట్ల‌తో బ్రిడ్జ్‌.. కుమార భాస్క‌ర వ‌ర్మ సేత‌ను ప్రారంభించిన మోదీ

TRINETHRAM NEWS

Trinethram News : గౌహ‌తి, నార్త్ గౌహ‌తి మ‌ధ్య ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ప్ర‌యాణ స‌మ‌యం త‌గ్గ‌నున్న‌ది. ఈశాన రాష్ట్రాల్లో నిర్మించిన తొలి పీఎస్సీ(ప్రెస్‌స్ట్రెస్డ్ కాంక్రీట్‌) బ్రిడ్జ్‌గా దీన్ని పిలుస్తున్నారు.

బ్రిడ్జ్‌ను ఆవిష్క‌రించిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ దానిపై కాసేపు వాకింగ్ చేశారు. అస్సాం గ‌వ‌ర్న‌ర్ ల‌క్ష్మ‌ణ్ ప్ర‌సాద్ ఆచార్య‌, సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

భూకంపాల‌ను త‌ట్టుకునే రీతిలో.. ఐసోలేష‌న్ టెక్నాల‌జీ, ఫ్రిక్ష‌న్ పెండ్యూల‌మ్ బియ‌రింగ్స్‌తో బ్రిడ్జ్‌ను నిర్మించారు. గౌహ‌తి, నార్త్ గౌహ‌తి మ‌ధ్య ప్ర‌యాణ స‌మ‌యం ఏడు నిమిషాల‌కు చేర‌నున్న‌ది.

హై పర్ఫార్మెన్స్ స్టే కేబుల్స్‌ను నిర్మాణం కోసం వాడారు. బ్రిడ్జ్ హెల్త్ మానిట‌రింగ్ సిస్ట‌మ్‌ను కూడా ఏర్పాటు చేశారు. డ్యామేజ్ డిటెక్ష‌న్ కోసం అనేక మానిట‌రింగ్ విధానాల‌ను కూడా పొందుప‌రిచారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Modi inaugurates Kumar Bhaskara Varma Seta,

You cannot copy content of this page

Scroll to Top