
EWS కోటా వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారు.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Trinethram News : ఈడబ్ల్యూఎస్(EWS) కోటా వల్ల ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనారిటీ, నిరుద్యోగులు( నష్టపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.
తెలంగాణ శాసన మండలి సమావేశాలలో ఆయన మాట్లాడుతూ.. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ విషయంలో కానీ, కొత్త నియామకాల విషయంలో కానీ ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడం జరుగుతందన్నారు. అసలు 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులు ఉన్నారా? అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇదే విషయంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదే పదే మండలిలో మాట్లాడారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాల భర్తీ జరిగిందని, ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయడం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉద్యోగాల విషయంలో కొంత నష్టం జరిగిందని తెలిపారు. జబల్ పూర్ కోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం పోగా మిగిలిన 50 శాతం నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతం తీసుకోవచ్చని చెప్పిందని, కానీ ఇక్కడ ఉన్న రిజర్వేషన్ల నుంచే 10 శాతం తీయడం వల్ల వెనుకబడిన వర్గాలకే గాక ఓపెన్ కేటగిరి వాళ్లకు కూడా నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటా ఎంతమంది ఉన్నారో ఫిక్స్ చేయాలని, దీని వల్ల అందరికీ సమన్యాయం జరుగుతుందని చెప్పారు. అంతేగాక దీనివల్ల వెనుకబడిన వర్గాలకు అవకాశాలు పెరిగేందుకు ఛాన్స్ ఉందని, ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ అవకాశం ఉంటే ఆ విధమైన ప్రయత్నాలు చేయాలని మల్లన్న కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
