WhatsApp Image 2024 11 20 at 2.39.07 PM
“పంచముఖ హనుమాన్” దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు …
Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 – గాజుల రామారం డివిజన్ బతుకమ్మ బండలో పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ ల పర్యవేక్షణలో నిర్వహించిన పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచముఖ హనుమాన్ దీవెనలతో ప్రజలంతా పూర్తి ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలుకుల జగన్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, 125 డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు డి.విజయ్ రామ్ రెడ్డి , సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, అజయ్ ప్రసాద్ గుప్తా,సాయిబాబా, మల్లేష్, ఆసిఫ్, రంజాన్, గోవర్ధన్ రెడ్డి, ప్రసాద్, మంజుల లక్ష్మి మరియు ఆలయ కమిటీ సభ్యులు పరమేష్ స్వామి, చెట్ల వెంకటేష్, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
