అల్లూరిజిల్లా(హుకుంపేట) త్రినేత్రంన్యూస్, మే 5: అగ్రలో ఇటీవల ముగిసిన 9వ నేషనల్ ఫెడరేషన్ కప్ టార్గెట్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అల్లూరి జిల్లా హుకుంపేట మండలం పోసలగరువు గ్రామానికి చెందిన జనసైనికుడు నిక్కుల విద్యా కళ్యాణ్ కాంస్య పతకం సాధించడంపై స్థానిక జనసేన నేతలు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు బలిజ కోటేశ్వరరావు పడాల్ మాట్లాడుతూ, “చిన్ననాటి నుంచే క్రీడలపై ప్రత్యేక అభిరుచి కలిగిన విద్యా కళ్యాణ్, సామాన్య కుటుంబంలో జన్మించినా తన లక్ష్యాన్ని మరిచిపోకుండా శ్రమించి ఈ ఘనత సాధించడం గర్వకారణం,” అన్నారు.
విద్యా కళ్యాణ్ మొదట (బీపీఈడి) పూర్తి చేసి, అనంతరం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ నుండి (ఎం పి ఈడి) చదివి, ప్రస్తుతం ఒక ప్రైవేట్ కళాశాలలో శారీరక విద్యా అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆటపై ఉన్న ఆసక్తితో టార్గెట్ బాల్ జట్టులో చోటు సంపాదించి, జట్టుకు కీలక ఆటగాడిగా తన పాత్రను నిర్వహిస్తున్నారు.
విద్యా కళ్యాణ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, మండల జనసేన నాయకులు, గ్రామస్థులు, మిత్రులు అతనికి శుభాకాంక్షలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


