ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
MLA Visits Teacher

MLA Visits Teacher : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 26; బుట్టాయగూడెం మండలం, గ్రామానికి చెందిన క్రాంతి ఉపాధ్యాయుడు ఇటీవల గుండెకు సంబంధించిన అనారోగ్యంతో స్టంట్ శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకున్న తక్షణమే పోలవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు నేరుగా నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని ఆప్యాయతతో అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యం ఎలా ఉందో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని. ఆకాంక్షించారు. .

ఈ సందర్భంగా వాళ్లకు ధైర్యం చెప్పి, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలతో తమకు ఉన్న అనుబంధంలో భాగంగా ఆపద మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను స్వయంగా పరామర్శిస్తూ అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని చిర్రి బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయకులు పూనెం రాజా, ఏసుబాబు, మారిశెట్టి అనిల్, కరాటం సతీష్, ఫణి, వెంకటేశ్వరరావు,నెలటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page