MLA visits Srinu Babu : శ్రీను బాబును పరామర్శించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS
MLA visits Srinu Babu

MLA visits Srinu Babu : త్రినేత్రం న్యూస్: మార్చ్ 17: నెల్లూరు జిల్లా : కావలి రూరల్ మండలం తుమ్మలపెంట కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ వైస్ ఎంపిపి వాయిల శ్రీను బాబు అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరు లోని సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , మంగళవారం హాస్పిటల్ కి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించవలసినదిగా డాక్టర్లకు సూచించారు. శీను బాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top