తేదీ : 13/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ రైతులకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలు, రాయితీలను అందిస్తూ, లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తూ , వాళ్ల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వెనిగండ్ల. రాము అన్నారు. కంకిపాడు రోడ్డులో గల డ్రైన్ పరివాహక పంట పొలాల్లో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా పెద్ద ఎరుకపాడు, బేతవోలు, పరివాహక రైతులతో వాళ్ల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కట్టపటిష్టంగా లేకపోవడంతో వరదలు వచ్చిన ప్రతిసారి గండ్లు పడి పంటలు మునుగుతున్నాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తనకు అవగాహన ఉందని కట్ట పటిష్టానికి ఇప్పటికే రూపాయలు పది లక్షల తో అంచనాలు రూపొందించమని త్వరలో ఆ పనులు మొదలవుతాయని రైతులతో చెప్పారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సుబ్బారావు, కూటమి నాయకులు దారపు .రెడ్డి మనీశ్వరావు, గూడపాటి. రాజు ,కడప కల్లు ఆంజనేయులు, మండపాక గంగయ్య, అనంత. దాసు సుబ్రహ్మణ్యం, రాజనాల. సురేష్, వాసుపల్లి. ఉమ, శంకర్, కటికల. కళ్యాణ్, చిన్న బాబు, ఆదం .మోహన్, అమలా బాబు, బేతవోలు, ఎరుకపాడు, సీ పూడి గ్రామ రైతులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


