MLA Vegulla : ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

మండపేట: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈరోజు తాపేశ్వరం జీసస్ క్రైస్ట్ గ్లోరి చర్చి నందు పాస్టర్ ఫెలోషిప్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ డేనియల్ పాల్ ఆధ్వర్యంలో జరిగిన ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకల్లో రాష్ర్ప అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ముఖ్యఅతిథిగా ప్లాగొన్నారు.

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు ప్రేమ మన అందరిని నడిపిస్తుందని మనమందరం ఐక్యతతో మెలగాలని క్రైస్తవుల సమగ్ర అభ్యున్నతికి పాటుపడతానని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ ను బిషప్ డాక్టర్ డానియల్ పాల్, మరియు మూడు మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు శాలువాతో, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో సేవకులు, సేవకురాండ్రు మరియు సహోదరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vegulla participated in

You cannot copy content of this page

Scroll to Top