అసత్య ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

TRINETHRAM NEWS

అసత్య ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 11.12.2023.

తను ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని వస్తున్న ఆరోపణలను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

తను సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం మండలంలో లంక భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నానని వెల్లడించారు.

కావాలని తనపై ఈ విధంగా కొంతమంది పని కట్టుకుని రాజీనామా చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాననే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top