గిరిజన చట్టాల సవరణకు కుట్రలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే శిరీష దేవి ఆదివాసులకు క్షమాపణ చెప్పాలి
అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 15 : కాంగ్రెస్ పార్టీ ఆదివాసి రాష్ట్ర వైస్ చైర్మన్ వెంగడ నీలకంఠం మాట్లాడుతూ. అసెంబ్లీలో రంపచోడవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి. నాన్ ట్రైబల్స్ కు ఏజెన్సీలో ఇల్లు ఇవ్వండి, అనడం గిరిజనులకు వ్యతిరేకం అని చెప్పవచ్చు. అలాగే, పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. గిరిజనులకు వ్యతిరేకంగా నాన్ ట్రైబల్ సంఘం పెట్టుకోండి అని చెప్పడం.
తెలంగాణ రాష్ట్రం. మహబూబు నగర్ బిజెపి ఎంపీ డీకే అరుణ బోయా,వాల్మీకి లను ఎస్టీ జాబితా చేర్చండి . అనడం అలాగే టూరిజం లో పెట్టుబడులు కోసం1/70చట్టం సవరణ చేయాలి..!!విశాఖ లో,ప్రాంతీయ పెట్టు బడుల సదస్సులో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.
ఈపైన నలుగురు అభిప్రాయం విన్నాక కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన,బీజేపీ పార్టీల్లో ఉన్న గిరిజన నాయకులు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, గిరిజనులకు ద్రోహం చేస్తు. ఆదివాసుల హక్కులను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ పార్టీ ఆదివాసి రాష్ట్ర వైస్ చైర్మన్ వెంగడ నీలకంఠం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే లందరికీ ఆదివాసి చట్టాలపై అవగాహన కోసం శిక్షణ తరగతులు ఇవ్వాలని ముఖ్యమంత్రిని విన్నవించు కున్నారు. చట్టసభలో ఉన్నాం కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడకుండా, వ్యవహరించకుండా చర్యలు తీసుకో వలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి దేనని, లేదా ప్యూహాత్మకంగా ప్రభుత్వమే వీరి చేత మాట్లాడిస్తున్నారని భావించవలసి వస్తుందని అన్నారు.
ప్రజాస్వామ్య భారతదేశంలో ఆదివాసి చట్టాలను గౌరవించకుండా అవహేళన చేస్తే సహించేది లేదని, అలాంటివారు ముమ్మాటికి రాజ్యాంగ చట్టా వ్యతిరేకులేనని, ఆదివాసి ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని ఆదివాసి ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


