ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
MLA Nenavath Balu Naik

▪️ పార్థివదేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

▪️కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి

MLA Nenavath Balu Naik : డిండి గుండ్ల పల్లి జులై 15,త్రినేత్రం న్యూస్. డిండి మండలం ఖానాపూర్ గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు ముత్తాని అంతిరెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పేర్కొన్నారు.

అంతిరెడ్డి మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్ ఖానాపూర్ గ్రామానికి చేరుకొని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో డిండి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు , పార్టీ సీనియర్ నాయకుడు యాదగిరిరావు డిండి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, శాంతిగూడెం సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డి , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల శశిధర్ రెడ్డి , సర్పంచ్ శంకర్, కొర్ర రవి, మాజీ సర్పంచ్ రాజు, పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొని అంతిరెడ్డికి నివాళులర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page