డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించిన, ఎమ్మెల్యే నల్లమిల్లి
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం రంగంపేట:త్రినేత్రం
4-01-2025
రంగoపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని” ప్రారంభించి, విద్యార్థులతో కలసి భోజనం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ సందర్బంగా నల్లమిల్లి మాట్లాడుతూ….
విద్యార్దులు శారీరకంగా, మానసికంగా బలవంతులు కావాలనే సదుద్దేశ్యంతో ఇంటర్మీడియట్ విద్యార్దులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆలోచించడం దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది.
గత ప్రభుత్వంలో కేంద్రసాయంతో పెట్టిన పధకాలకు కూడా జగనన్న పధకం అంటూ ఒక ప్రహసనంగా మారిన పరిస్దితులలో నేడు నారా లోకేష్ గారు ఒక మహత్తర మార్పుకి నాంది పలికారు.
మన ప్రాంతంలో అన్నదానానికి అన్నపూర్ణగా నిలిచిన డొక్కా సీతమ్మ, పేరుని ఈ మధ్యాహ్న భోజన పధకానికి పెట్టాలని నిర్ణయించడం చాలా సముచితమైన నిర్ణయం, అబ్దుల్ కలాం , సర్వేపల్లి రాధాకృష్ణ , డొక్కా సీతమ్మ వంటి మహానుభావుల పేర్లు ప్రభుత్వ పధకాలకు పెట్టడం యువతకు మంచి సందేశం ఇవ్వడమే కాకుండా ఆ మహానుభావులను భావితరాలు గుర్తుంచుకునేలా చేయడమే, విద్యార్దులలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం వలన వారు శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి వారికి పౌషికాహారం అందించడం అవసరం.
రాష్ట్రవ్యాప్తంగా 44,119 పాఠశాలల్లో 33,81,000 మంది విద్యార్దులకు మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేస్తున్నారు 432 కోట్లు కేంద్ర ప్రభుత్వం 1422 కోట్లు ఈ పధకానికి రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్నాయి, విద్యావ్యవస్ధలో సమూల మార్పులు తీసుకురావడం కోసం నారా లోకేష్, అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
విద్యార్దులు సాంకేతికతను అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకుపోవాలి, సమాజంలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాల సంస్కృతికి విద్యార్దులు దూరం ఉండటమే గాక తోటి విద్యార్దులెవరైనా ఈ సంస్కృతికి అలవాటు పడుతుంటే వారిని దానినుండి బయట పడేయాలి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App