Ganja : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న అశ్వారావుపేట ఎస్సై యయాతి రాజు మరియు, తదితర పోలీసు బృందం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. తేదీ: 19.04.2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం,పోలీసు స్టేషన్ పరిధిలో

అశ్వారావుపేట ఇన్సెక్టర్. యయాతి, రాజు కు వచ్చిన, విశ్వసనీయ, సమాచారం MP 09HH 8811 నంబర్ గల లారీ లో, విజయనగరం నుండి, మధ్యప్రదేశ్, లో ని అగర్ మాల్యా, ప్రాంతానికి ప్రభుత్వ నిషేదిత, గంజాయి ని తరలిస్తున్నట్లు, గా సమాచారం రాగా ఎస్సై, తన సిబ్బంది తో ఉదయం, అశ్వారావుపేట ,శ్రీ. లక్ష్మీ తులసి, పేపర్ .బోర్డ్, ఎదురుగా, నేషనల్ హైవే 365 BB, అశ్వారావుపేట, వద్ద కాపు, కాచి వాహన తనికీ లు నిర్వహిస్తుండగా, జంగారెడ్డిగూడెం. వైపునుండి వస్తున్న, MP 09HH 8811 నంబర్ గల లారీని ఆపి. దానిలో ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారించి. వారిని అదుపులో ,కి తీసుకుని అట్టి లారీలో తనికీ చేయగా.

పెద్ద మొత్తం లో 216 గంజాయి ప్యాకెట్లు లభించగా, ఎస్సై , సమక్షంలో వారిని విచారించగా లారీ నడిపిన వ్యక్తి, (1) ముఖేష్ సూర్య వంశీ @ ముఖేష్ S/o రమేష్ చంద్ర సూర్య వంశీ, వయస్సు: 31 సంవత్సరాలు, కులం: మెగ్వాల్, వృత్తి: డ్రైవరు R/o జామూనీయా, షాజాపూర్, అఘర్ మాల్వా, మధ్యప్రదేశ్ -రాష్ట్రం, పిన్ కోడ్- 465441 అని, మరియు డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తులు వారిపేర్లు వివరాలు (2) రాజేష్ గుల్జార్ @రాజు S/o పర్వత్ సింగ్ గైరి, వయస్సు: 32 సంవత్సరములు, కులం: గుర్జార్, వృత్తి: డ్రైవరు, R/o MN -116, Ward cr07, పచోరా, శివ ఘర్ -పోస్ట్, షాజాపూర్ (పాత జిల్లా), ప్రస్తుతం అఘర్ మాల్వా-జిల్లా, మధ్యప్రదేశ్- రాష్ట్రం, పిన్ కోడ్:465230, మరియు మరొక వ్యక్తి (3) సాలగ్రామ్ S/o శంకర్ లాల్, వయస్సు: 32 సంవత్సరములు, కులం: గుజార్, వృత్తి: వ్యవసాయం, R/O కార్కాడియా (తోడి వీధి) గ్రామం, నాల్టేడా, పచలానా- తహశీల్, అఘర్మాల్వా జిల్లా, మధ్యప్రదేశ్- రాష్ట్రం అని, ముఖేష్ సూర్య వంశీకి శంకర్ సింగ్ అనే వ్యక్తి ద్వారా ఒక గంజాయి, రవాణా డీల్ వచ్చిందని శంకర్ సింగ్ కి తెలిసిన ఠాకుర్ అనే ఒక వ్యక్తికి,

విజయనగరం నుంచి మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా ప్రాంతానికి గంజాయిని జాగ్రత్తగా తరలించినట్లయితే ఐదు లక్షల వరకు డబ్బులు ఇస్తాడు అని చెప్పగా, ముఖేష్ సూర్య వంశీ తన స్నేహితుడు అయిన రాజేష్ గుజ్జర్ తో చెప్పి డీల్ చేసేందుకు సిద్ధపడి ఇట్టి విషయాన్ని ఠాకూర్ కి చెప్పగా ఠాకూర్ ముఖేష్ సూర్య వంశీతో సోమనాథ్ అనే వ్యక్తి మీకు గంజాయి సప్లై చేస్తాడని మరియు అట్టి గంజాయిని తరలించేందుకు ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి అని మొత్తం అన్ని విషయాలు అతడి చెప్తాడని సోమనాథ్ ను ముఖేష్ సూర్య వంశీకు పరిచయం చేసినాడు అని. ముఖేష్ సూర్య వంశీ ఈ డీల్ మొత్తం అయిదు లక్షల రూపాయలని రాజేష్ గుజ్జర్, సాలగ్రామ్ గుర్జార్ లకు చెప్పి అట్టి గంజాయిని సిఫ్ గా తరలించడానికి సాలగ్రామ్ గుర్జర్కు 50,000 వరకు డబ్బులు ఇస్తామని, రాజేష్ రెండు లక్షలు మరియు ముఖేష్ సూర్య వంశీ కి 1,50,000/- తీసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకుని రాజేష్ లారీ లో గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఈరోజు అశ్వారావుపేట ” పోలీసు వారికి పట్టుబడి నట్లు నేరం అంగీకరించగా లారీ లో లభించిన 216 గంజాయి ప్యాకెట్లు సుమారు 2,31,8,7000/- రూపాయల విలువగల 463.740 కేజీల గంజాయిని మరియు లారీని, మరియు ముగ్గురు వ్యక్తుల వద్ద గంజాయి రవాణా కొరకు ఉపయోగించిన 6 సెల్ ఫోన్ లను పోలీసు వారు పంచనామా ద్వారా స్వాదీన పర్చుకొని పట్టుబడి ముగ్గురు వ్యక్తులపై మరియు ఇట్టి రావణాకి డీల్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఠాకుర్ పై, గంజాయి వ్యాపారి సోమనాథ్ పై మరియు వారికి సహకరించిన వ్యక్తులపై పోలీసు వారు కేసు నమోదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Aswaraopet SI Yayati Raju

You cannot copy content of this page

Scroll to Top