త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి..రామగుండం ఏటీసీ గవర్నమెంట్ ఐటీఐలో నిర్వహించిన షార్ట్ టర్మ్ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వారితో పాటు మేయర్ మహంకాళి స్వామి పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
యువతకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని, ఇలాంటి షార్ట్ టర్మ్ కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.
అలాగే విద్య ద్వారా మాత్రమే యువత తమ లక్ష్యాలను సాధించగలరని, సమాజ అభివృద్ధికి కూడా వారు తోడ్పడగలరని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు ఐటీఐ అధికారులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


