జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 22 at 20.08.35

TRINETHRAM NEWS

రైతులందరూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

మంగళవారం రోజున గంగాధర మండలంలోని మధురానగర్, నారాయణపూర్, మంగపేట గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్లకొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని,సన్న ధాన్యాలకు ప్రభుత్వము ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాలుకు 500 రూ.బోనస్ ఇస్తుంది అని రైతులందరూ అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి గింజ కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ బాలాగౌడ్,గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత-శ్రీనివాస్ రెడ్డి, గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమళ్ళ మనోహర్ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, గంగాధర పిఎసిఎస్ వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,మహిళలు, రైతులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page