జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 17 at 2.52.21 PM

TRINETHRAM NEWS

కుల,మత, ప్రాంత, పార్టీలకతీతంగా అభివృద్ధి చేపట్టాలి : సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే కేపీ.వివేకానందనిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముచ్చటగా మూడవసారి నన్ను గెలిపించారని, ఇది తన విజయం కాదని అందరి విజయమని, తన విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపడదామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసి మరిన్ని నూతన పనులు చేపట్టి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణా రావు, మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శెనిగల ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page