Trinethram News : జగద్గిరిగుట్టలో నూతనంగా నిర్మించిన మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో సంక్షేమం – అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, నియోజకవర్గంలో కుల భవనాల ఏర్పాటుకు వీలైన చోట భూమిని కేటాయిస్తూ రానున్న రోజుల్లో కూడా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుదామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు రషీద్ భాయ్, మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పార్శి ప్రకాష్ గుప్త, ప్రధాన కార్యదర్శి ఉప్పల చంద్రశేఖర్ గుప్త, అదనపు ప్రధాన కార్యదర్శి యెర్రం శ్రీనివాస్ గుప్త, కోశాధికారి ధారం సతీష్ గుప్త, కార్యక్రమ నిర్వాహకులు తేరాల శ్రీనివాస్ గుప్త, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్ రేగూరి ప్రవీణ్ కుమార్ గుప్తా, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గౌరవ చైర్మన్ కాచం కైలాసం గుప్త, అధ్యక్షులు ఉప్పల రమేష్ గుప్త, ఉపాధ్యక్షులు నేతి శంకర్ గుప్త, కార్యదర్శి చిగుళ్లపల్లి లక్ష్మణరావు గుప్త, కోశాధికారి మహంకాళి సురేష్ గుప్త, వర్కింగ్ ప్రెసిడెంట్ యాద నరేందర్ గుప్త, గంజి స్వామి గుప్త, అంగడి సత్యనారాయణ గుప్త, లక్ష్మీ నరసయ్య గుప్త, శేర్విరాల కృష్ణమూర్తి గుప్త, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.