జూలై 23, 2026

WhatsApp Image 2023 12 14 at 8.27.44 PM

TRINETHRAM NEWS

అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద …

ఈరోజు సాయంత్రం కొంపల్లి మున్సిపాలిటీ పరిధి అపర్ణ ఫామ్ గ్రోవ్’ స్ నందు కొంపల్లి మున్సిపాలిటీ మహిళ అధ్యక్షురాలు ఎడమ సంగీత భాస్కర్ రెడ్డి గారి అధ్వర్యంలో జరిగిన అభినందన సభ కార్యక్రమానికి కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో పాటు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరవగా అపర్ణ ఫామ్ గ్రోవ్’ స్ వాసులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారిని శాలువాతో సత్కరించి హ్యాట్రిక్ విజయం అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ దాదాపు 15 కోట్ల రూపాయల నిధులతో వాటర్ రిజర్వాయర్, వాటర్ పైప్లైన్ నిర్మాణము, వీధిదీపాల ఏర్పాటు వాటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులతో శివారు మున్సిపాలిటీల అభివృద్ధి చేపడతామన్నారు. అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, మాజీ ఎంపీపీ సన్న కవిత శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్స్ రవీందర్ యాదవ్, పూజారి వసంత, సీనియర్ నాయకులు జంధా కుమార్, తెల్లా వినోద్, శ్రీకాంత్ రెడ్డి, జీ.సంతోష్ కుమార్, సీహెచ్. శ్రీనివాస్ రెడ్డి, పీ.బాల్ రాజ్, అజయ్, దుర్గా రావు, నాగార్జున రెడ్డి, బాబు, అవని రెసిడెంట్స్ అసోసియేషన్ అద్యక్షులు రమణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page