జూలై 23, 2026

WhatsApp Image 2023 12 14 at 5.59.20 PM

TRINETHRAM NEWS

అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు

వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం నందు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో నేడు వినుకొండ నియోజకవర్గ స్థాయి వాలంటీర్లు మరియు గృహసారధుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ముందుగా ఈపూరు మండలం లోని అన్ని సచివాలయాల వాలంటీర్లు, గృహసారధులు గ్రామ సచివాలయ కన్వీనర్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వాలంటీర్లకు, గృహసారధులు, సచివాలయం కన్వీనర్ లకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వాలంటీర్ల చేసే సేవా కార్యక్రమాలు అనేకమని, కరోన సమయంలో వారు చేసిన సేవలు వర్ణనాతీతం అని అన్నారు. అలాగే వారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా వాలంటీర్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం అందజేసే పథకాలు ప్రజలకు ఇంకా చేరువ చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమం అయిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో నాకు ఎంతో సహకరించి, త్వరితగతిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వినుకొండ నియోజకవర్గంలో పూర్తి చేసేందుకు మీ యెక్క సహాకారం అందించినందుకు ధన్యవాదములు తెలియజేశారు. అలాగే వాలంటీర్లకు ఇద్దరు గృహ సారథులు గా నియమించి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం వేసిన మరో ముందడుగే గృహ సారథులని అన్నారు. గృహ సారథులు కూడా ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో రాజకీయ అభివృద్ధి కి ఈ గృహ సారథులకే ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page