Trinethram News : ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా బహదూర్ పల్లి లోని కెఎం.పాండు మెమోరియల్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ సౌజన్యంతో నిర్వహించిన “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకుల ద్వారా వొకేషనల్ విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందించారు. అనంతరం విద్యార్థుల సమక్షంలో కేక్ ను కట్ చేసి, కళాశాల ఆవరణలో చెట్లను నాటి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ ను కేంద్ర బిందువుగా అభివృద్ధి పరిచి పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చి ప్రపంచపటంలోనే హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన నాయకులు కేటీఆర్ ని, కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, నాయకులు సగ్గిడి పద్మా రావు, సత్యనారాయణ, మురళీ, దామోదర్, నారాయణ రావు, వొకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ మైమూన్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేందర్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


