MLA Kavya Krishna Reddy : స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి జయంతి వేడుకలులో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్ర న్యూస్ :నవంబర్:26, నెల్లూరు జిల్లా :కావలి. స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి కి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు,దివంగత నేత మాగుంటసుబ్బరామిరెడ్డి జయంతి సందర్భంగా,కావలి ఆర్టీసీ ,బస్టాండ్ ఎదురుగా ఉన్న మాగుంట పార్వతమ్మ రోడ్‌లోని కాంశ్య విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాగుంట అభిమానులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తన ధ్యేయంగా, జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేసిన మహానుభావుడు మాగుంట సుబ్బరామిరెడ్డి . ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం మా బాధ్యత. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , సహకారంతో కావలి ట్రంకు రోడ్డుకి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేయడం మా గౌరవం. నన్ను రాజకీయంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టిన మాగుంట కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.

అలాంటి మహోన్నత నాయకుడి జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందంగా సందర్భంగా తెలియపరిచారు కావలిలో మాగుంట ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న గుంటుపల్లి రాజకుమార్ చౌదరిని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు .. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాయకునికి నివాళులు అర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kavya Krishna Reddy participated

You cannot copy content of this page

Scroll to Top