Trinethram News : తేది :4.12.2025. మార్కాపురం మండలం. మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో మార్కాపురం డివిజన్ డెవలప్మెంట్ అధికారి నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నూతన డిడిఓ ఆఫీసు లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ వర్చ్యువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధికారులు, స్థానిక మండల అధికారులు పాల్గొన్నారు.
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం మండలంలోని గోగులదిన్నె గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 65 రోజులు పాటు పోరాటాల ఫలితంగా మార్కాపురం జిల్లా వచ్చిందని దానికి ఈ ప్రాంత ప్రజలంతా శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి రుణపడి ఉంటామని అన్నారు. జిల్లా ప్రకటన వచ్చింది. జనవరి కి మార్కాపురం జిల్లా అవుతుంది. Ysrcp వాళ్లు పనికట్టుకుని జిల్లా గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు. గతంలో జిల్లా పోరాటలను వైసీపీ వాళ్ళు వ్యతిరేకించారు.చంద్రన్న మార్కాపురం జిల్లా గా పేరు పెట్టుకున్నాము.
గతంలో జగనన్న పేరుతో చాలా పథకాలకు పేర్లు పెట్టుకున్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారు. మంచి చేసే నాయకులను, పార్టీ నీ ఆదరించాలని కోరారు. గత ప్రభుత్వం లో రాష్ట్రంలో కంపెనీలు ఇతర ప్రాంతాలకు వెళ్ళాయి. నూతన విధానం తో అధునాతన సాంకేతిక పరికరాలతో మెరుగైన వైద్యం అందిస్తాం. మార్కాపురంలో మినీ మిర్చి యార్డు తీసుకుని వస్తున్నాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే వైసీపీ నాయకులు ప్రారంభోత్సవం చేశారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి. మన ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
రైతన్న మీకోసం అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా రైతులకు ప్రభుత్వం సలహాలను సూచనను ఇస్తున్నారు. గతంలో ఎవరైనా మీ ఇల్లవద్దకు వచ్చి సేవలు చేసారా అని అన్నారు. మార్కాపురం లో అభివృద్ధి చేసానని నేను గర్వంగా చెప్పుకుంటున్నాము. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కంటే అధికంగా సంకేమ పథకాలను ఇచ్చాము. మార్కాపురం చెరువు నిండింది. ప్రస్తుతం బోడపాడు చెరువుకు నీరు చేరుతుంది. త్వరలో నిండుతుంది.
ఈ కార్యక్రమంలో మార్కాపూర్ మండల అధికారులు, గ్రామం ప్రజలు, రైతులు పాల్గొన్నారు.
- మార్కాపురం మండలంలోని పెద్ద యాచవరం గ్రామం నకు చెందిన కొంగలిటి వారి వివాహ మహోత్సవానికి విచ్చేసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
- మండలంలోని నాయుడు పల్లి గ్రామానికి చెందిన తిరుమల రెడ్డి లక్ష్మి రెడ్డి ఆకస్మికంగా మరణించారు. వారి భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
- నాయుడుపల్లి గ్రామానికి చెందిన తిరుమలరెడ్డి చెన్నారెడ్డి ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


