
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం జగన్నాధపురం ములకలపల్లి మసీదులలో పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సహోదరులు నిర్వహిస్తున్న వేడుకలలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీ సహోదరులందరికీ మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని దానికి అనుగుణంగా చండ్రుగొండ మండలంలో మహమ్మద్ నగర్ గ్రామాన్ని ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేయటం కోసం తాను స్వయంగా దత్తత తీసుకోవడం జరిగిందని దాదాపు మూడు కోట్ల రూపాయలు గ్రామ అభివృద్ధి కోసం కేటాయించామని అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయాని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
