MLA Jare : నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. 29.09.2025 – సోమవారం. అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఈరోజు ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నారు.మున్సిపాలిటీ పరిధిలో గతంలో నిర్మించబడిన 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేసి ఇండ్లు కేటాయించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అశ్వారావుపేట కొత్త మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.15 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఈ నిధులతో ,నూతన మున్సిపాలిటీ భవనం,ఆధునిక మున్సిపల్ మార్కెట్,పబ్లిక్ టాయిలెట్లు, ట్యాంక్ బండ్ అభివృద్ధి దొంతికుంట చెరువు నందు సీసీ రోడ్లు డ్రైనేజీల,నిర్మాణ పనులు చేపట్ట బడనున్నామని తెలిపారు.అశ్వారావుపేట, దమ్మపేట, మందలపల్లి, చండ్రుగొండ, బస్ స్టాండ్ ల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను తెలియజేసారు అలాగే, నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త బీటీ రోడ్లు,రైతుల కోసం పంట, పొలాలకు వెళ్లేందుకు గ్రావెల్ రోడ్లు సైడ్ డ్రైనేజీల నిర్మాణం కోసం కూడా నిధులు సమీకరించామని త్వరలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి ,ఎమ్మార్వో రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ నాగరాజు,పలు శాఖల అధికారులు మండల నాయకులు జూపల్లి ప్రమోద్,ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Jare Adinarayana held a press conference

You cannot copy content of this page

Scroll to Top