
MLA Bandaru Satyananda Rao : ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనోశాంతి లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.బడుగువానిలంకలో బుధవారం అయ్యప్ప స్వామి భక్తులు ఘనంగా నిర్వహించిన గోదావరి ఆరాట్టు, ఆరవ ఉత్తర నక్షత్ర జన్మదిన వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆరాట్టు అంటే స్వామి వారి మూర్తిని నదిలో శుద్ది చేసే మహోన్నత కార్యక్రమమని నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివరించారు. కేరళలో ఈ ఉత్సవాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తారని స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి పంబానదిలో ఈ ఆరాట్టు కార్యక్రమం నిర్వహిస్తారని, గోదావరితీరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారని వారు తెలిపారు.ఎమ్మెల్యే నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

