దేవరకొండ జులై 08 త్రినేత్రం న్యూస్. ఆర్థిక ఇబ్బందులతో ఎవరు వైద్యసేవలు కోల్పోకూడదన్నదే మా ప్రజా ప్రభుత్వ ధ్యేయం. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వ్యవసాయ మార్కెట్ యార్డులో దేవరకొండ నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 427మంది లబ్ధిదారులకు 1,71,39,000.00 రూపాయల విలువ గల చెక్కులు మరియు ప్రభుత్వ నుంచి మంజూరు అయిన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా ఎం ఎల్ ఏ బాలునాయక్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపశమనం కలిగిస్తోంది అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య ఖర్చులు భారంగా మారిన వేళ, ఈ సహాయం ఎంతో అవసరమవుతోంది.దేవరకొండ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యాన్ని కోల్పోకూడదన్నదే నా లక్ష్యం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ సహాయం మా కుటుంబానికి పెద్ద ఊరట. వైద్యానికి అవసరమైన నిధులు లేక అవస్థలు పడుతున్న వేళ ప్రభుత్వం ఇచ్చిన ఈ సాయం మరపురాని మేలు అని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం దేవరకొండ నియోజకవర్గ ప్రజలపై ఎమ్మెల్యే బాలు నాయక్ కి ఉన్న అనురాగాన్ని, సేవాభావాన్ని మరోసారి ప్రతిబింబించింది అని అన్నారు.
పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ… సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
అనంతరం పెండ్లిపాకల రిజర్వాయర్ ముంపు (పత్య తండా) రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరు అయిన 30మందికి నష్టపరిహారం చెక్కులను అందజేయడం జరిగింది. భూ నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మండల అధికారులు, గ్రామస్థాయి నాయకులు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


