Trinethram News : May 10, 2025, తెలంగాణ : నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన నిర్వహించారు. పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు ఈ కిరీటం కోసం పోటీపడుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


