WhatsApp Image 2024 01 07 at 2.43.48 PM
కొమురవెల్లి మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
Trinethram News : సిద్దిపేట జిల్లా: జనవరి 07
కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి మల్లన్న కల్యాణ వేడుకలుఆదివారం ఉదయం అత్యంత ఘనంగా జరిగాయి.
మల్లన్న శరణు శరణు అంటూ జయజయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది.
కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివశక్తులు శివాలెత్తి పోయారు.
ఒగ్గు పూజారులు ఆధ్వ ర్యంలో సంప్రదాయ బద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ లను మల్లన్న పెళ్లాడారు. స్వామి, అమ్మవార్లకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆలయ పాలక మండలి, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు…
