Minister Tummala : మారుమూల గ్రామాలలో పర్యటించిన మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారె

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం

గిరిజన కొండరెడ్ల గ్రామాలకు మహార్ధశ

నూతనంగా నిర్మాణం చేసిన మూడు హై లెవెల్ బ్రిడ్జిలు ప్రారంభోత్సవం

వినాయకపురం ఆర్ అండ్ బి రోడ్డు నుంచి పూసుకుంట కట్కూరు మీదుగా రాచన్నగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

దమ్మపేట మండలంలో పర్యటించిన తెలంగాణ వ్యవసాయ చేనేత మార్కెటింగ్ జౌళి శాఖల మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మరియు స్థానిక శాసనసభ్యులు.. జారె ఆదినారాయణ… గిరిజన గ్రామాలైన పూసుకుంట, కట్కూరు గ్రామాలను సందర్శించి ఇటీవలే నిర్మించిన మూడు బ్రిడ్జిలు ప్రారంభించారు. అదేవిధంగా వినాయకపురం ఆర్ అండ్ బి రహదారి నుంచి రాచన్నగూడెం వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భాగంగా పూసుకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటూ గిరిజనులను అన్ని రంగాలలో ముందు ఉంచటానికి ప్రత్యేక చొరవ తీసుకుందని దానికి అనుగుణంగానే శాసనసభ్యులు జారె ఆదినారాయణ ఆశయాలు అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి పట్ల వారి ఆలోచనలకు అనుగుణంగా తాను ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించి అన్ని విధాల మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని గతంలో ఈ ప్రాంతాన్ని వ్యవసాయరంగ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఉచితంగా బోర్లు మోటార్లు మంజూరు చేసి ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించిందని ఐటీడీఏ ద్వారా ఈ గిరిజన గ్రామాలలో అన్ని సౌకర్యాలు కల్పించబోతున్నామని తెలియజేశారు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని పేర్కొన్నారు. అనంతరం గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతుందని గతంలో ఈ గిరిజన గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టి స్థానికంగా ఉన్న సమస్యలు గుర్తించి గెలిచిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు అందించటం జరుగుతుందని గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని దానికి అనుగుణంగానే ఈ గ్రామాలకు రహదారులు వంతెనలు వ్యవసాయరంగా అభివృద్ధి తదితర కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ సారధ్యంలో అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో ముందుండాలని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఐటీడీఏ వారి ఆధ్వర్యంలో గ్రామస్తులకు మంజూరైన టెంట్ హౌస్ డీజే సిస్టం తేనెటీగల పెంపకం యూనిట్లను లబ్ధిదారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , ఐటీడీఏ పీవో బి రాహుల్ , ఆర్డీవో బి మధు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, వివిధ శాఖల ముఖ్య అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు అనుబంధ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు స్థానిక గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Tummala, MLA Jare

You cannot copy content of this page

Scroll to Top