Minister Sridhar Babu : ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

TRINETHRAM NEWS

ఖాజగూడలోని స్పర్శ్ హాస్పిస్ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారితో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. స్పర్శ్ హస్పీస్” నిర్వాహకులు, వైద్యులు, ఇతర సిబ్బందితో మంత్రి శ్రీధర్ బాబు, చివరి దశలో ఉన్న రోగులకు ఇంటి దగ్గర వైద్య సేవలు అందించేందుకు ఖాజాగూడలోని “స్పర్శ్ హస్పీస్” కు మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎలక్ట్రిక్ వాహనాలను అందజేశారు.
ఈ వాహనాలను రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ దాతల సహకారంతో సమకూర్చింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…

ఎవరూ మరణాన్ని కోరుకోరు. చివరి గడియల్లో ఉన్న వ్యక్తులు అనుభవించే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. అలాంటి వారిపై ప్రేమ, ఆప్యాయత ను చూపించడం ఒక మనిషిగా మన బాధ్యత. మీతో మేమున్నాం అనే భరోసాను కలిగించడం అవసరం.

ఒక ఆసుపత్రిని నడపాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చివరి ఘడియల్లో ఉన్న వారికి సేవలు అందిస్తున్న “స్పర్శ్ హస్పిస్ ” సేవలు అభినందనీయం. అందరికీ స్ఫూర్తి దాయకం. వీరికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఈ కేంద్రానికి ఉచితంగా నీటిని సరఫరా చేస్తాం. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.

పాలియేటివ్ కేర్ పై సమాజంలో మరింత అవగాహన రావాలి. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది.

స్పర్శ్ హ్యాస్పిస్” లాంటి కేంద్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు కావాలి. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలియేటివ్ కేర్ సేవలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తాం.

పాలియేటివ్ కేర్ విభాగంలో సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బంది సేవలు అభినందనీయం.
కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా.సంజీవ్ రెడ్డి, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister inaugurating electric vehicles

You cannot copy content of this page

Scroll to Top