Minister Seethakka : కొత్తగా 2 లక్షల పెన్షన్లు

TRINETHRAM NEWS
Minister Seethakka New pensions of 2 lakh

Minister Seethakka : త్రినేత్రం న్యూస్ : Mar 29, 2026, తెలంగాణ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కొత్తగా లక్ష పింఛన్లు మంజూరు చేశామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పింఛన్లు ఇస్తామని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. కొత్తగా ఇవ్వబోయే పింఛన్లకు సంబంధించి తాజా బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు.

పింఛన్లు తొలగిస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారి, రెండు పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించి ఆపేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఒక్కో పింఛనుకు రూ.200-300 మాత్రమే ఇస్తోందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top