ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ
హైదరాబాద్ : ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని ధరణి కమిటీ తెలిపింది. ఈనేపథ్యంలో మధ్యంతర నివేదికపై మంత్రితో కమిటీ చర్చిస్తోంది. బుధవారం 4 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. క్షేత్రస్థాయిలో భూసమస్యలపై కమిటీ ఆరా తీయనుంది. మంత్రికి కమిటీ మధ్యంతర నివేదిక ఇవ్వనుంది. కమిటీ నివేదికపై మంత్రి పొంగులేటి రేవంత్‌తో చర్చించనున్నారు.