ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలో ఈరోజు బుధవారం మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. తెలుగు వారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి ఉత్సవాల సందర్భంగా గంగాధర నెల్లూరునియోజకవర్గంలో మినీ మహానాడు ను సదరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో పెనుమూరు మండలం, వెదురుకుప్పం మండలం,పాలసముద్రం మండలం, కార్వేటి నగరం మండలం,ఎస్ఆర్ పురం మండలంలోని టిడిపి పార్టీ శ్రేణులు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు, వివిధ పార్టీ పదవులు పొందిన నాయకులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మినీ మహానాడు ను విజయవంతం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mini Mahanadu in Gangana Nellore

You cannot copy content of this page