మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ముస్లిం వెల్పేర్ ఆర్గనైజేషన్ సొసైటీ సభ్యులు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన గాంధీ పార్క్ స్కూల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ నవంబర్ 11న జయంతి ఘనంగా నిర్వహించారు స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ముస్లిం వెల్పేర్ ఆర్గనైజేషన్ సొసైటీ అధ్యక్షుడు షేక్ హాజీ అలీ హాజరై వారి చేతులమీదుగా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా నోటి బుక్కులు మరియు పెన్ పెన్సిల్ మరియు మిఠాయిలు పంపిణీ చేశారు.. షేక్ హాజీ అలీ
ఈ సందర్భంగా మాట్లాడుతూ… మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్… మౌలానా అంటే పండితుడు, కలాం అంటే భాషా జనకుడు అని అర్థం. ఆజాద్ ఆయన కలం పేరు మహా విధ్వంసుడైన ఆజాద్ విద్యా శాఖ మంత్రి అవ్వడం గొప్ప అదృష్టం. మన దేశంలో విద్య అభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి అబుల్ కలాం ఆజాదే..ఆయన అనేక విద్య సంస్కరణలు చేసి దేశ అభ్యున్నత్యానికి కృషి చేశాడు. పిల్లలందరూ ఉన్నత చదువులు చదువుకొని పెద్దపెద్ద మహానీయులు గా ఎదగాలని సూచించారు. చెడు వ్యాసాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సొసైటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు జాకీర్ అలీ, సొసైటీ సభ్యులు.. హుస్సేన్, మొబీన్, నజీముద్దీన్, మునవర్, శానవాజ్, ఇస్మాయిల్, మోయిన్, అఫ్టల్, సయ్యద్ నాయబ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App