జూలై 5, 2026

WhatsApp Image 2024 11 11 at 15.58.10

TRINETHRAM NEWS

28 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన సిపి

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో పనిచేస్తున్న 1996 బ్యాచ్ లో ఎంపికైన ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, పీసీఆర్ ఇన్స్పెక్టర్ రవీందర్ లు ఈరోజు తో 28 సంవత్సరాల పోలీస్ సర్వీస్ పూర్తయిన సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ఐజి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సిపి అధికారులతో కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సీపీ అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని, ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణతో విదులు నిర్వహించారో అదేవిధంగా మిగతా సర్వీస్ పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు,ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, పీసీ ఆర్ ఇన్స్పెక్టర్ రవీందర్ లు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page